వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్
లండన్: డబ్ల్యుటిఎ ర్యాంకింగ్స్‌లో 572వ స్థానంలో ఉన్న రెండుసార్లు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ విజేత పెట్రా క్విటోవాకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది. ఈ మేరకు గ్రాండ్‌స్లామ్ టోర్నీ నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్విటోవా 2011, 2014లో ఆల్ ఇంగ్లండ్ క్లబ్ విజేతగా నిలిచింది. అనంతరం 17నెలల ప్రసూతి సెలవుల కారణంగా రాకెట్ పట్టని క్విటోవా.. గత ఫిబ్రవరిలో తిరిగి మైదానంలోకి దిగింది. మాజీ నంబర్ 2 ర్యాంకర్ అయిన 35ఏళ్ల క్విటోవా.. ఈనెలలో జరిగిన గ్రాస్‌కోర్ట్ టోర్నీలో తొలిరౌండ్‌లోనే ఓటమిపాలైంది. దీంతో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నేరుగా ప్రధాన టోర్నీకి అర్హత సాధించిన రెండో ప్లేయర్ క్విటోవా మాత్రమే. అంతకుముందు పురుషుల సింగిల్స్‌లో బ్రిటన్‌కు చెందిన మాజీ నంబర్‌వన్ ఆటగాడు డాన్ ఎవాన్స్‌కు నేరుగా ఎంట్రీ దక్కింది.
క్విటోవాకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ
- Advertisement -
- Advertisement -