No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeదర్వాజ'వనజీవి'చరిత్రకు అక్షర నీరాజనం

‘వనజీవి’చరిత్రకు అక్షర నీరాజనం

- Advertisement -

జీవితమంతా ప్రకృతి కోసమే ధారపోసిన మహనీయుడు వనజీవి రామయ్య. గ్లోబలైజేషన్‌ కాలంలో బడా పెట్టుబడిదారుల ధనదాహం వల్ల పర్యావరణ విధ్వంసం పెద్దమొత్తంలో జరుగుతోంది. దీంతో కాలాలు గతి తప్పుతున్నాయి. విపరీతమైన కరువులు, వశపడని వరదలు సామాన్యులను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల నుండి బయటపడడానికి ఒకే ఒక్కమార్గం మొక్కలు నాటి చెట్లు పెంచడమే. ఈ రహస్యాన్ని కనుగొన్న ప్రకతి పుత్రుడు వనజీవి రామయ్య. ఆ రామయ్య జీవిత చరిత్రను ‘విత్తనం నుండి మహావక్షం దాకా… వనజీవి జీవితం’ పేరుతో అందంగా అక్షరీకరించిన కలం నరేష్‌ జిల్లా. ఈ పుస్తకం నిండా రామయ్య జీవితాన్ని దశలవారిగా అందించాడు. సజీవమైన భాషలో రామయ్య జీవితంలోని ముఖ్య ఘట్టాలను కళ్లముందుంచాడు. తెలుగు సాహిత్యంలో అనేక జీవిత చరిత్రలు ఇప్పటికే వచ్చాయి. వాటిలో కొన్నే నిలిచిపోయాయి. అందుకు కారణం అవి రాసిన రచయితల రచనాశైలే. పాఠకుడికి సదరు వ్యక్తి యొక్క జీవితంలోని ముఖ్య సంఘటనలను పరిచయం చేయడంలో రచయిత తన నైపుణ్యాన్ని చూపించాల్సి ఉంటుంది. ఆ పనిని ఈ యువ రచయిత నరేష్‌ విజయవంతంగా చేశాడు.
అత్యంత వెనుకబడిన కుమ్మరి కులంలో జన్మించాడు రామయ్య. కేవలం ఐదవ తరగతి వరకే చదువుకున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అలాంటి రామయ్యకు తల్లిదండ్రి నేర్పిన జీవిత పాఠాలు తనను ప్రకతి వైపుకు మళ్లించాయి. మొక్కలు నాటడం వల్ల ప్రకతి బాగుంటుంది. ప్రకతి బాగుంటే ప్రజలు బాగుంటారనే ఎరుక రామయ్య అనతి కాలంలోనే గుర్తించాడు. అలా తన జీవితాన్ని మూడు ముఖ్యమైన పనులకు ఉపయోగించాడు. 1.మొక్కలు నాటడం 2.విత్తనాలు సేకరించడం 3.ప్రజల్లో అవగాహన కోసం ప్రచారం నిర్వహించడం. అందులో భాగంగానే తను ఎక్కడ అడుగు పెడితే అక్కడ మొక్కలు నాటడాన్ని తన దినచర్యగా మార్చుకున్నాడు. మొక్కలు నాటడమే అన్నింటికంటే పుణ్యకార్యమని భావించాడు. మనిషై పుట్టినవాడు తనకు ఎన్నో ఇచ్చిన ప్రకతిని కాపాడుకోకుంటే సార్థక లేదని భావించాడు. అట్లా వందలు, వేలు కాదు లక్షలు, కోట్ల సంఖ్యలో మొక్కలు నాటాడు. ప్రముఖుల చేత ప్రశంసలు అందుకున్నాడు. వారిలో ముఖ్యమంత్రులూ ఉన్నారు. అట్లా పేదింటిలో పుట్టిన రామయ్యను పద్మశ్రీ పురస్కారం వరించేలా శ్రమించాడు. ఎన్ని అవార్డులు వచ్చినా, ఎన్ని ప్రశంసలు దక్కినా తన మొక్కలు నాటే పని మాత్రం మానుకోలేదు. ఆఖరికి యాక్సిండెట్‌? అయినా, గుండెపోటు వచ్చినా ఆసుపత్రి నుండి కోలుకొని రాగానే, మళ్లీ మొక్కలు నాటడం అనే మహాయజ్ఞాన్ని మాత్రం మానుకోలేదు. అంతటి నిబద్ధత రామయ్యది. తన కన్న కొడుకు అకాల మరణం పాలైనా సరే రామయ్య మొక్కలు నాటడాన్ని ఆపలేదు. ఈ పుస్తకంలో రచయిత పేర్కొన్నట్టు… జైలులో వేస్తే అక్కడ కూడా మొక్కలు నాటుతానని అనడం రామయ్యలోని అంకితభావానికి నిదర్శనం.

ఇలాంటి రామయ్య జీవితాన్ని పూస గుచ్చినట్టు వర్ణించాడు రచయిత నరేష్‌ జిల్లా. రామయ్య జీవితం మీద తాను చాలా పరిశోధన చేశాడు. అసలు పర్యావరణ పరిరక్షణకు చరిత్రలో ఉన్న ఆధారాలను వెతికి పట్టుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ కషి ఎవరెవరు ఎట్లా చేశారో నిరూపించాడు. చెట్లను కాపాడడం కోసం ప్రాణత్యాగాలు చేసిన 300మంది బిష్ణోరుల గురించి చెప్పాడు. అలాగే దర్పెల్లి రామయ్య ముత్తాతల కాలం దాకా వెళ్లి వారి జీవన శైలిని, ప్రకతి పట్ల వారికున్న ప్రేమను సైతం కనుగొన్నాడు. అలా కుమ్మరి ఈరయ్య మనువడిగా రామయ్య ఎట్లా వనజీవిగా ఎదిగి వచ్చాడో స్పష్టంగా ఆవిష్కరించాడు. ఇందుకోసం రామయ్యతో అనేక దఫాలుగా చర్చించాడు. ఆ అన్వేషణ నుండి రామయ్య జీవితాన్ని అక్షరీకరించాడు. ుష్ట్రవ వఙశీశ్రీబ్‌ఱశీఅ శీట Vaఅajవవఙఱ =aఎaఱaష్ట్రను పాఠకుల ముందుంచాడు. ఆదర్శంగా జీవించిన ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని రేపటి తరాలకు అందించేందుకు ఎంతగానో శ్రమించాడు. చిన్న చిన్న వాక్యాలతో, కవితాత్మక పోలికలతో రామయ్య జీవితానికి మట్టిపరిమళాన్ని అద్దాడు. రామయ్య పుట్టినప్పుడు సమస్త ప్రకతి పులకించింది, పక్షులు కిలకిలారావాలు చేశాయి, రామయ్య ముత్తాత ఈరయ్య నాటిన చెట్ల గాలి అతని శ్వాసలో కలిసింది అని రామయ్య పుట్టుకను వర్ణించాడు. అలాగే రామయ్య చనిపోయినప్పుడు ప్రకతి ఎంత దు:ఖించిందో, చెబుతూ లోకాన్ని పచ్చగా వీక్షించడానికి రామయ్య నక్షత్రాల్లో కలిశాడని పోల్చుతాడు ఈ రచయిత. తమ స్వార్థం తాము చూసుకునే కాలంలో ఇట్లా సమాజ పచ్చదనం కోసం జీవించిన వన జీవి నిజమైన ఆదర్శవాది. అలాంటి రామయ్య కషి పట్ల గుండెల నిండా ప్రేమతో రాసిన పుస్తకమే ఇది. ఈ పుస్తకాన్ని ఇంత చక్కగా రచించిన రచయిత నరేష్‌ , రేపటి కాలానికి ఒక గొప్ప రచయితను వాగ్ధానం చేస్తున్నాడు.
డా.పసునూరి రవీందర్‌, 77026 48825

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad