Tuesday, July 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆవుపై దాడి చేసిన పులి బ్రతుకుతుందా..?

ఆవుపై దాడి చేసిన పులి బ్రతుకుతుందా..?

- Advertisement -

పోలీసుల అదుపులో వ్యక్తి
నవతెలంగాణ – రామారెడ్డి

ఆవుపై దాడి చేసిన పెద్దపులి బ్రతుకుందా లేదా అనే కోణంలో ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో ఆవుపై పెద్దపులి దాడి చేసిన విషయం విధితమే. దాడి చేసిన ఆవుపై విష పదార్థాలను చల్లడంతో, మరుసాటి రోజు ఆవు కళేబరాన్ని పెద్దపులి తిన్నట్లు సమాచారం. తిన్న పెద్దపులి బ్రతుకుందా ? లేక ఇతర ప్రాంతంలోకి వెళ్లిపోయిందా అనే కోణంలో అడవి అధికారులు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుగుతున్నట్టు కూడా విశ్వాసనీయ సమాచారం. ఏది ఏమైనా పులి జాడలను అడవి అధికారులు గుర్తించవలసిన బాధ్యత కత్తి మీద సాముల మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -