నవతెలంగాణ-హైదరాబాద్: ఈనెల 24న జరగనున్న నీతి ఆయోగ్ గవర్నర్ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతానని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. తమ రాష్ట్ర న్యాయమైన ఆర్థిక హక్కులు కోసం గళం గళం విప్పుతామన్నారు. తమిళనాడుకు రావాల్సిన న్యాయబద్ధమైనా, చట్టం బద్ధమైన నిధులు కోసం తాను కేంద్రంతో పోరాటం చేస్తామని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. “తమిళనాడు హక్కుల కోసం నేను సుప్రీంకోర్టులో కేసు వేశాను. నా విధానంపై నేను దృఢంగా నిలబడతాను! తమిళనాడుకు నిధులు పొందడానికి నేను పోరాడతాను” అని పేర్కొన్నారు. మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానం అమలు చేయకూడదని నిర్ణయించిన తర్వాత.. నిధులను నిలిపివేసిందని ఆరోపిస్తూ మోడీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
నీతి ఆయోగ్ గవర్నర్ కౌన్సిల్‌కు హాజరవుతా: ఎంకే స్టాలిన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES