Monday, February 9, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తా: సర్పంచ్

ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తా: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ 
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ అన్నారు. సోమవారం ముధోల్ మండలంలోని ఆష్ట గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తొమ్మిది అంశాలపై చర్చించారు. వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించి ప్రజలకు నీటి సరఫరా చేయాలని చర్చించారు. స్థానిక వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలనిఅన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదని, పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుందని, యువత కు జూదం వల్ల కలిగే నష్టాలను వివరించడం తో పాటు పలు అంశాలను గ్రామపంచాయతీ సర్పంచి తో కలిసి పాలకవర్గం సభ్యులు చర్చించారు. సర్పంచ్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రజల అభిప్రాయం మేరకు ముందుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సురుగుల సావిత్రి కోటయ్య, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -