– ఢిల్లీ సీఎం నివాసం వద్ద ఆవాస్ అధికార్ జన్ ఆందోళన
– భారీ వర్షంలోనూ కొనసాగిన నిరసన
న్యూఢిల్లీ : సరైన పునరావాసం లేకుండా ఇందిరా కాలనీలో తొలగింపులు, కూల్చివేతలు వద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నివాసం వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆవాస్ అధికార్ జన్ ఆందోళన పేరుతో జరిగిన ఈ ఆందోళనలో వందలాది మంది ఇందిరా కాలనీ నివాసితులు, సీపీఐ(ఎం), సీపీఐ (ఎంఎల్), సీపీఐ, డివైఎఫ్‌ఐ, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, సీఐటీయూ, ఎఐసీటీయూ ప్రతినిధులు పాల్గొన్నారు. భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా నిరసన కొనసాగింది. పంజాబీ బాగ్ ప్రాంతంలోని ఇందిరా కాలనీకి రైల్వే జారీ చేసిన అక్రమ నోటీసును ఖండించారు. ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు (డీయూఎస్‌ఐబీ) నోటిఫైడ్ సెటిల్మెంట్ అయిన ఇందిరా కాలనీకి ఎలా నోటీసులు జారీ చేస్తారని ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఢిల్లీ నాయకులు ఆశా శర్మ, సిద్ధేశ్వర్ శుక్లా, డీవైఎఫ్‌ఐ ఢిల్లీ కార్యదర్శి అమన్ షైని, సీపీఐ(ఎం) నార్త్ వెస్ట్ సెక్రటరీ గోవింద్ జా, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అంకిత్, సీపీఐ (ఎంఎల్) నాయకులు ఆర్‌పి సింగ్, శ్వేతా రాజ్, సిపిఐ నేతలు సంజీవ్ రానా, ఐద్వా నాయకులు మీనా, ఇందిరా కాలనీ నివాసితులు మనోజ్, అనిత, ఇతరులు పాల్గొన్నారు.
సరైన పునరావాసం లేకుండా కూల్చివేస్తారా..?
- Advertisement -
- Advertisement -