Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మారా చంద్రశేఖర్ కు డీసీసీ పీఠం వరించేనా.?

మారా చంద్రశేఖర్ కు డీసీసీ పీఠం వరించేనా.?

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్    
జిల్లాలో రాష్ట్ర ఎన్నికల పరిశీలకులతో పాటు ఇన్చార్జిలను సైతం నియమించినారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులకు రాష్ట్ర జిల్లా స్థాయిలో పెద్ద పదవులు లభించలేదు. మండలంలోని అంకాపూర్ గ్రామానికి చెందిన జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నారు. గత 39 సంవత్సరాల నుండి 1987 లో మాజీ మంత్రి సంతోష్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగగా అప్పటినుండి ఇప్పటివరకు ఆర్మూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మండలంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మారా చంద్రమోహన్ 1987 లో ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షునిగా కీలక పాత్ర పోషించినారు. 1988 నుండి 94 వరకు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా,1991…94 వరకు పి ఏ సి సి ఎస్ చైర్మన్ గా,  99 నుండి 2004 వరకు గ్రామ సర్పంచ్ గా ప్రజల సమస్యల పరిష్కారంలో తీవ్ర కృషి చేసినారు.

2005 నుండి 10 వరకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా , 2015 నుండి 19 వరకు టీపీసీసీ అధికార ప్రతినిధిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. రైతన్నల అభివృద్ధిలో భాగంగా గుప్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిజం సాగర్ కెనాల్ అభివృద్ధిలో సేవలు అందించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలంగా మారడానికి, పార్టీ పుంజుకోవడానికి సైతం విస్తృత సేవలు అందించారు. పార్టీకి నిబద్ధతగల వ్యక్తిగా మర చంద్రమోహన్ నిర్విరామ కృషి చేస్తున్నారు. నేడు సోమవారం జిల్లా కేంద్రానికి కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ హర్షత్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు వస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -