- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంత్రిపురారం మండలం కామారెడ్డి గూడెం నుంచి కంపాలపల్లి వరకు వున్న రెండు కిలోమీటర్ల బీటీ రోడ్డుని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న శుక్రవారం మరమ్మతులు చేయించారు. కామారెడ్డి గూడెం మరియు కంపాలపల్లి గ్రామస్తుల కోరిక మేరకు అడగ్గానే మహాంకాలమ్మ కుంట అలుగు నీరు పోయే దగ్గర గుంతల్లో రూ.40 వేల సొంత ఖర్చులలో మట్టి పోయించి, బాగు చేయించారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. పాలకులు చేయలేని పని బుసిరెడ్డి పాండురంగారెడ్డి అడగ్గానే చేయడం మాకు ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. గ్రామస్తులు పాండురంగారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -



