- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని తొమ్మిదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుండి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న ఉరుదొండ వనిత శుక్రవారం అవార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆ వార్డులోనీ ప్రజలు డ్రైనేజీ త్రాగునీటి సమస్యల గురించి వివరించారు. తాను కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నానని, చేయి గుర్తుకు ఓటు వేసి కరుణ జరిపించాలని కోరారు. తాను గెలిచిన వెంటనే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వారికి హామీ ఇచ్చారు. ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నాయకులు ఉన్నారు.
- Advertisement -



