Sunday, May 18, 2025
Homeఅంతర్జాతీయంపుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడుతా: అమెరికా ప్రెసిడెంట్

పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడుతా: అమెరికా ప్రెసిడెంట్

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్:
ఉక్రెయిన్‌లో రక్తపాతాన్ని ముగించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడతానని అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ పేర్కొన్నారు. కాల్పుల విరమణపై రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య మొదటి ప్రత్యక్ష చర్చలు జరిగిన ఒక రోజు తర్వాత ట్రంప్‌ ఈ ప్రకటన చేశారు. సోమవారం పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడతానని అన్నారు. పుతిన్‌, ట్రంప్‌ల ఫోన్‌కాల్‌ సిద్ధం చేయనున్నట్లు క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ అన్నారు. పుతిన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీల మధ్య సమావేశం ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత మాత్రమే సాధ్యమవుతుందని అంతకు ముందు ఆయన ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

గతమూడేళ్లలో మొదటిసారిగా రష్యా, ఉక్రెయిన్‌ ప్రతినిధుల మధ్య ప్రత్యక్షంగా చర్చలు జరిగాయి. ఇరు దేశాలు చెరో వెయ్యిమంది ఖైదీలను విడుదల చేసేందుకు అంగీకరించాయని రష్యా ప్రతినిధి బృంద నేత వ్లాదిమిర్‌ మెదినిస్కీ పేర్కొన్నారు. 2022లో యుద్ధం ప్రారంభమైన తర్వాత కుదిరిన అతిపెద్ద యుద్ధ ఖైదీల మార్పిడి ఒప్పందమిది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -