నవతెలంగాణ – వనపర్తి : వనపర్తి జిల్లా వనపర్తి నియోజకవర్గ పరిధిలోని ఫోటోగ్రాఫర్లందరికీ తాను ఎల్లవేళలా అండగా ఉంటానని, ఎలాంటి సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. వనపర్తి పట్టణంలోని ఎం వై ఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఫోటోగ్రాఫర్లకు సంఘం తరఫున అందించే రాష్ట్రస్థాయి గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గ పరిధిలోని ఫోటోగ్రాఫర్లందరికీ తాను ఎల్లవేళలా అండదండగా ఉంటానని ఫోటోగ్రాఫర్ల సంఘానికి కావలసిన సంఘ భవన నిర్మాణాన్నీ త్వరలోనే ఏర్పాటు చేసుకుందామని ఎమ్మెల్యే అన్నారు. సోనీ కంపెనీ తరఫున నియోజకవర్గ పరిధిలోని ఫోటోగ్రాఫర్లకు వీడియో గ్రాఫర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ల సంఘం నాయకులు, సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఫోటోగ్రాఫర్లకు అండదండగా ఉంటా: ఎమ్మెల్యే మేఘారెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES