Tuesday, February 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలు మాట్లాడనివ్వదా.?

బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలు మాట్లాడనివ్వదా.?

- Advertisement -

సభలో మాట్లాడితే సస్పెండ్ 
భువనగిరి ఎంపీ చామల 
నవతెలంగాణ – ఆలేరు 

ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంట్లో లేవనెత్తుతుంటే స్పీకర్ పక్షపాత ధోరణితో బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ మైక్ కట్ చేశారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పార్లమెంట్ సమావేశాల్లో మంగళవారం పాల్గొని సస్పెండ్ గురైన ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మైక్ ఎందుకు కట్ చేశారని వెల్లోకి వెళ్లి ప్రశ్నించగా తనతో పాటు మరో ఎనిమిది మంది ఎంపీలను కూడా సస్పెండ్ చేసినట్టు చెప్పారు.

బిజెపి ప్రభుత్వ వైఫల్యాలు దేశవ్యాప్తంగా ప్రజలకు  తెలుస్తాయని భయంతో సస్పెండ్ చేశారని కాంగ్రెస్ వల్లనే సభ వాయిదా పడుతుందని బిజెపి తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. సభ నడిస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంపుకు భయపడి ప్రధాని మోడీ సాగిల పడుతున్న విషయాలు బయటపడతాయని భయంతో బిజెపి ఉందన్నారు. బుధవారం సస్పెండ్ గురైన ఎనిమిది మంది ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేయనున్నట్లు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -