Thursday, April 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమంత్రి పొంగులేటిని సీఐడీ విచారణ చేస్తుందా?

మంత్రి పొంగులేటిని సీఐడీ విచారణ చేస్తుందా?

- Advertisement -

– నా గొంతు నొక్కేందుకే నోటీసులు
– ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటా : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మంత్రి హోదాలో ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సీబీసీఐడీ అధికారలు విచారణ చేస్తారా?అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. అందుకే తాము అక్రమ మైనింగ్‌ వ్యవహారాలపై హౌజ్‌ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశామన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమ మైనింగ్‌పై హౌజ్‌ కమిటీ సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు వెయ్యడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వంలో భాగమైన సీబీసీఐడీ విచారణ సజావుగా ఎలా జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో అని తాను అడిగితే దానికి ఆయన తనపై తుపాకీ పెట్టారని అన్నారు. తనను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందనీ, అయినా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల గొంతుకగా ఉంటాననీ, సమస్యలపై పోరాడతానని చెప్పారు. తనపై సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు ఎథిక్స్‌ కమిటీకి ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. ఈనెల నాలుగున హుజురాబాద్‌లో డంపింగ్‌ యార్డుకు వ్యతిరేకంగా కార్యక్రమం పెట్టుకుంటే సీఐడీ విచారణకు రావాలని తనకు నోటీసులు ఇచ్చిందన్నారు. హుజురాబాద్‌లో డంపింగ్‌ యార్డును పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అక్రమంగా కాల్పులు జరిపిన కరీంనగర్‌ సీపీ ఆలం గౌస్‌పైన సీఐడీ విచారణ జరపాలని అన్నారు.

అవినీతిని ప్రశ్నిస్తే డైవర్షన్‌ పాలిటిక్స్‌ : కల్వకుంట్ల సంజయ్
ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. అసెంబ్లీ పని దినాలు తగ్గిపోతున్నాయని చెప్పారు. కడియం శ్రీహరిని వెనకేసుకొచ్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆయన పార్టీ మారడం గురించి ఎందుకు ప్రశ్నించలేదన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అవినీతిని ప్రశ్నిస్తే కడియం శ్రీహరిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌లో అన్ని అనుభవించి ఇపుడు కేసీఆర్‌ను కడియం తప్పుబడుతుంటే తమకు కోపం రాదా?అని ప్రశ్నించారు. కాళేశ్వరం నీళ్లు కండ్ల ముందు కనిపిస్తుంటే అబద్దాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

పొంగులేటి బినామీ వేముల వీరేశం : చిరుమర్తి లింగయ్య
ఎమ్మెల్యే వేముల వీరేశం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి బినామీగా మారాడని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ఎక్కడో ఉన్న వేముల వీరేశం అనే వ్యక్తిని సమాజానికి పరిచయం చేసిందే కేసీఆర్‌ అని గుర్తు చేశారు. నకిరేకల్‌ నియోజకవర్గంలో వేముల వీరేశం ఇసుక నుంచి మొదలు భూముల వరకు అన్నింటినీ దోచుకుంటున్నాడని అన్నారు. ఆయన పదవి కోసం ఎంతకైనా దిగజారుతాడని చెప్పారు. నకిరేకల్‌లో ఆయన ఆగడాలు ఎక్కువైపోయాయని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -