ప్రత్యేక జీవో జారీ చేసిన ప్రభుత్వం
3072 మంది రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
నవతెలంగాణ – మల్హర్ రావు
తెల్లకాగితాలపై రాసుకున్న భూ కొనుగోలు ఒప్పందాల (సాదాబైనామా) క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రక్రియ నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో 76 జారీ చేసింది. దీని ప్రకారం భూమి కొనుగోలు చేసిన వ్యక్తి ఆఫిడవిట్ ఇస్తే సరి పోతుందని,విక్రయిoచిన వ్యక్తి నుంచి అఫిడవిట్ అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సుదీర్ఘకాలంగా భూ హక్కుల కోసం ఎదు రుచూస్తున్న రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లో రైతులు అందించిన దరఖాస్తులపై విచారణ చేపట్టి అర్హుల వివరాలు అధికారులు సేకరించి సిద్ధంగా ఉంచారని తెలుస్తోంది. ప్రభుత్వ తాజా ఆదేశాలతో అలాంటి వారికి భూహక్కు లభించే అవకాశముంది.
2014 జూన్ 2 కటాఫ్ తేదీగా..
చేతిరాతల ఒప్పందాల ద్వారా భూక్రయ విక్రయాలు చేసుకున్న రైతులకు పట్టాలు లేకపోవడంతో ప్రభుత్వపరంగా అందాల్సిన ప్రయోజనాలు పొందలేకపోతున్నా రు. భూములు సాగు చేస్తున్నప్పటికీ యాజమాన్య హక్కు లేక సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో 12ఏళ్లకు పైగా భూమిని అధీనంలో ఉంచుకున్న రైతుల దరఖాస్తులు క్రమబద్ధీకరించాలని భావించినా అప్పటి ప్రభుత్వం ఇందుకు 2014 జూన్ 2వ కల్పించింది. దీంతో తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయించింది.
ఈ గడువు అభిప్రాయం లోపు జరిగిన క్రయ, విక్రయాలకు సంబంధించిన దరఖాస్తుల క్రమబద్ధీకరణకు నిర్ణయించి అలాంటి వారి నుంచి దర ఖాస్తులు స్వీకరించింది. అయితే విచారణలో తీవ్ర జాప్యం జరగడం, భూముల ధరలు అమాంతం పెరగడంతో అమ్మినవారు మొండికేయడంతో పట్టాల జారీ నిలిచిపోయింది. అయితే మరోసారి 2020 అక్టోబర్ లో మీ సేవ కేంద్రాల ద్వారా అవకాశం కల్పించడంతో మండలంలోని 18 రెవెన్యూ గ్రామాల్లోని 3072 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు.నాటి ధరణి రెవెన్యూ చట్టంలో సాదాబైనామాలు పరి ష్కరించే నిబంధనలు పొందుపరచకపోవడంతో హైకోర్టు ఈ ప్రక్రియ నిలిపివేసింది.
నిరీక్షణకు తెర పడనుందా.?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వీటి దరఖాస్తులు స్వీకరించింది.మండలం నుంచి 3072 మంది రైతులు దరఖాస్తులు రాగా వీటిని క్రమబద్దీకరించేలా ఆర్వోఆర్ 2020 స్థానంలో ఆర్వోఆర్-2025 భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చింది.ఈ చట్టంలోని సెక్షన్-6 ద్వారా సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది.ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవ కాశం కల్పిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో రైతుల ఏళ్లనాటి నిరీక్షణకు తెరపడింది.సాదా బైనామాలను క్రమబద్ధీకరించుకోవ డం ద్వారా రైతులకు భూ పట్టాలు జారీ అవుతాయని భావించారు.ఆ దిశగా రెవెన్యూ అధికారులు తమకు అందిన దరఖాస్తులను గ్రామాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించడంతో సమస్య తీరుతుందని అనుకున్నారు.కానీ దీనిపై ఆడుగు ముందుకుపడలేదు.
అర్హులైన రైతులకు న్యాయం చేస్తాం: రవికుమార్ మండల తహశీల్దార్
సాదా బైనామా దరఖాస్తుల శ్రమబద్ధీకరణ ప్రక్రియ సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేసిందని తెలిసింది. దీని ప్రకారం భూమి విక్రయించిన వ్యక్తి అఫిడవిట్ అవసరం లేదు. కొనుగోలు చేసిన వ్యక్తి సెల్ఫ్ అఫిడవిట్ అందిస్తే సరిపోతుంది.అందులో ఏమైనా తప్పని తేలితే వారినే బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటాం.



