Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాలనపై పట్టు చిక్కేనా.?

పాలనపై పట్టు చిక్కేనా.?

- Advertisement -

మండలంలో అత్యధిక సర్పంచ్లు కొత్తవారే
మహిళ సర్పంచ్ జీపీల్లో భర్తలు, కొడుకులు చక్రం తిప్పే అవకాశం
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలో నూతన పంచాయతీ పాలక వర్గాలు బాధ్యతలు చేపట్టాయి.అయితే గత రెండేళ్ల కాలంగా పంచాయతీలకు పాలకవర్గాలు లేక ప్రత్యేక పాలనలో ఇంచార్జిలుగా నియమించిన అధికారులు పంచాయతీలకు సరిగా పట్టించుకోక పోవడంతో పంచాయతీల్లో సమస్యలు నెలకొని ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి కొత్తపాలక వర్గాలు కృషి చేయడం ఒకింత కత్తిమీద సాము లాంటిదే. ఎందు కంటే మండలంలో దాదాపు 70 శాతానికి పైగా సర్పంచ్లు రాజకీయాలకు పూర్తిగా కొత్త వారు. మొదటి సారి రిజర్వేషన్లు కలిసి రావడంతో ఎన్నికల్లో పోటీచేసి సర్పంచ్ గా గెలుపొందారు. అలాంటి వారు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారా అనేది..ప్రశ్నగా మిగిలింది.

మండలంలో సర్పంచ్ల వివరాలిలా..
మండలంలో మొత్తం 15 గ్రామపంచాయతీలున్నాయి. తాడిచెర్ల గ్రామ సర్పంచ్ బండి స్వామి, కొయ్యుర్ గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ, ఆన్ సాన్ పల్లి గ్రామ సర్పంచ్ గుగులోతు మంజుల-జగన్,నాచారం గ్రామ సర్పంచ్ ఒర్రె వనమ్మ-రాజైలు సర్పంచ్ లు గతంలో ఉపసర్పంచ్ లుగా, వారి భర్తలు సర్పంచ్ లుగా పదవులు నిర్వహించిన అనుభవం ఉంది. కొయ్యుర్ సర్పంచ్ రాజమ్మకు జెడ్పిటిసి,ఉప సర్పంచ్ గా అనుభవం  ఉంది. మిగతా రుద్రారం, ఎడ్లపల్లి, మల్లంపల్లి, మల్లారం, పెద్దతూండ్ల, చిన్నతూoడ్ల, వళ్లెంకుంట, కొండంపేట, ఇప్పలపల్లి, అడ్వాలపల్లి గ్రామాల్లో  సర్పంచ్ లు ప్రథమంగా ఎన్నికయ్యారు.

అయితే ఇందులో కొందరు దీర్ఘకాలికంగా రాజకీ యాల్లో ఉన్నా..ఏనాడు పదవులు చేపట్టలేదు. కొన్ని గ్రామాల్లో గెలిచిన సర్పంచ్లో నాచారం, అడ్వాలపల్లి, వళ్లెంకుంట, కొండంపేట, కొయ్యుర్, ఆన్ సాన్ పల్లి గ్రామాల్లో మహిళలు ఉన్నారు. కొయ్యుర్ మినహా ఆయా జీపీల్లో మహిళా సర్పంచ్ల కొడుకులు, భర్తలు గ్రామంలో పెత్తనం చెలాయించే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -