Sunday, April 5, 2026
E-PAPER
Homeఆటలుజోరు కొనసాగేనా?

జోరు కొనసాగేనా?

- Advertisement -

– సూపర్‌జెయింట్స్‌తో సన్‌రైజర్స్‌ ఢ నేడు
– 300 స్కోరుపై ఆరెంజ్‌ ఆర్మీ గురి
మధ్యాహ్నం 3.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
నవతెలంగాణ-హైదరాబాద్‌

ఐపీఎల్‌ మేనియా ఉప్పల్‌ స్టేడియానికి చేరుకోవటంతో.. సన్‌రైజర్స్‌ లక్ష్యం 300 పరుగులపై పడింది!. విధ్వంసక బ్యాటింగ్‌ లైనప్‌.. అభిషేక్‌ శర్మ, ట్రావిశ్‌ హెడ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, ఇషాన్‌ కిషన్‌కు తోడు అనికెత్‌ వర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డిలు సైతం ఫామ్‌లోకి వచ్చారు. దీంతో నేడు లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో అచ్చొచ్చిన ఉప్పల్‌లో రికార్డు స్కోరు బాదేందుకు ఆరెంజ్‌ ఆర్మీ సిద్ధమవుతోంది. ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ విజయం సాధించగా, లక్నో సూపర్‌జెయింట్స్‌ ఆడిన ఒక్క మ్యాచ్‌లో పరాజయం పాలైంది. నేడు తొలి విజయం కోసం సూపర్‌జెయింట్స్‌ ఎదురుచూస్తుండగా.. విజయంతో పాటు అభిమానులు ఎదురుచూస్తున్న 300 బాదేందుకు సన్‌రైజర్స్‌ రంగం సిద్ధం చేస్తోంది.

పరుగుల వరదే!
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఉప్పల్‌ స్టేడియంలో భారీ స్కోర్లు బాదిన రికార్డులు సొంతం. ఓపెనర్లు ట్రావిశ్‌ హెడ్‌,అభిషేక్‌ శర్మలు గత మ్యాచ్‌లో జోరందుకున్నారు. హెన్రిచ్‌ క్లాసెన్‌ అర్థ సెంచరీతో పరుగుల వేట మొదలెట్టాడు. ఇషాన్‌ కిషన్‌, నితీశ్‌ కుమార్‌రెడ్డి సహా అనికెత్‌ వర్మ సిక్సర్లు సంధించటంలో పోటీపడుతున్నారు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై నేడు భారీ స్కోరు లాంఛనమే. ఓపెనర్లు పవర్‌ప్లేలోనే మూడంకెల స్కోరు అందిస్తే.. క్లాసెన్‌, కిషన్‌ మిగతా సంగతి చూసుకుంటారు. బౌలింగ్‌ విభాగం సైతం ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. నైట్‌రైడర్స్‌ను స్వల్ప స్కోరుకు ఆలౌట్‌ చేసిన జోష్‌ కనిపిస్తోంది. ఈషన్‌ మలింగ, జైదేవ్‌ ఉనద్కత్‌, శివాంగ్‌ ఆకట్టుకున్నారు. డెవిడ్‌ పైనె జట్టులో తన స్థానానికి న్యాయం చేయాల్సిన అవసరం ఏర్పడింది.
లక్నో సూపర్‌జెయింట్స్‌ ఒత్తిడిలో పడింది. తొలి మ్యాచ్‌లో ఆ జట్టు ఆశించిన ప్రదర్శన కనబరచలేదు. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ పరుగుల దాహంతో కనిపిస్తున్నాడు. నికోలస్‌ పూరన్‌, రిషబ్‌ పంత్‌, ఎడెన్‌ మార్‌క్రామ్‌లు మెరిస్తే సూపర్‌జెయింట్స్‌ సైతం భారీ స్కోరు చేయగలదు. గత సీజన్‌లో సన్‌రైజర్స్‌ తరఫున నిరాశపరిచిన పేసర్‌ మహ్మద్‌ షమి.. నేడు ఆరెంజ్‌ ఆర్మీ బ్యాటర్లకు సవాల్‌ విసిరేందుకు సై అంటున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -