Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈసారైనా సన్నవడ్లకు బోనస్ దక్కేనా.?

ఈసారైనా సన్నవడ్లకు బోనస్ దక్కేనా.?

- Advertisement -

యాసంగిలో అందని వైనం..
ఖరీఫ్ లోనైనా బోనస్ చెల్లించాలని రైతుల వేడుకోలు..
నవతెలంగాణ – మల్హర్ రావు

వరిసాగు చేసే రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరి ధాన్యానికి బోనస్ ప్రకటించింది. గతేడాది వానాకాలం పంట దిగుబడులకు బోనస్ చెల్లించిన ప్రభుత్వం..యాసంగిలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లించలేదు. ప్రస్తుతం మండల వ్యాప్తంగా వరికోతలు ఊపందుకున్నాయి. కనీసం ఈ సారైనా ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లిస్తుందా.. లేదా అని రైతులు ఎదురుచూస్తున్నారు. మండలంలో అధికారుల లెక్కల ప్రకారం 15,500 ఎకరాల్లో వరి సాగైంది. పత్తి పంట తర్వాత అత్యధికంగా వరి పంట మోంథా తుపా సుకు దెబ్బతింది. మూడు రోజులపాటు కురిసిన ఆకాల వర్షాలతో కోతదశకు చేరిన పొలాల్లోని పైరు నేలవాలింది. దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది.

రైతుల్లో ఆశలు
ఈ సీజన్లో దాదాపు 90 శాతం మంది సన్న రకం వరి సాగు చేశారు.బోనస్ వస్తుందనే ఆశతో కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు ధాన్యం పోస్తున్నారు. దిగుబడి తక్కువగా ఉండటంతో బోనస్ కొంత అండగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389 చెల్లిస్తుండగా,సాధారణ రకానికి రూ.2,369 చెల్లిస్తోంది. ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారులు క్వింటాలు రూ.2,000 నుంచి రూ.2,100 వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా కల్లాల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అదే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం 17 మించకూడదనే నిబంధన ఉంది.తప్ప, తాలు ఉండకుండా చూసుకోవాలి. తప్ప, తాలు ఉంటే తూర్పారా. పట్టి విక్రయించాలి. తూకం, హమాలీ ఖర్చులను రైతులే భరించాలి.దీంతో కొందరు రైతులు ప్రైవేటు వ్యక్తులకు విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -