Tuesday, May 20, 2025
Homeఆటలుసింధు, ప్రణయ్మెరిసేనా?

సింధు, ప్రణయ్మెరిసేనా?

- Advertisement -

నేటి నుంచి మలేషియా మాస్టర్స్‌ 2025
కౌలాలంపూర్‌ (మలేషియా) :
భారత బ్యాడ్మింటన్‌ అగ్రశ్రేణి షట్లర్‌, రెండు సార్లు ఒలింపిక్‌ పతక విజేత పి.వి సింధు ఇటీవల పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోంది. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయటంలో నిలకడగా విఫలం అవుతున్న పి.వి సింధు నేటి నుంచి ఆరంభం కానున్న మలేషియా ఓపెన్‌లో బరిలోకి దిగుతోంది. పురుషుల సింగిల్స్‌లో సీనియర్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌ ప్రణయ్ సైతం ఇటీవల దారుణంగా ఆడుతున్నాడు. ఇటు పి.వి సింధు.. అటు హెచ్‌.ఎస్‌ ప్రణరు సుదిర్మన్‌ కప్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ పరాజయం పాలయ్యారు. సుదిర్మన్‌ కప్‌ తర్వాత విశ్రాంతి తీసుకున్న సింధు, ప్రణరు నేటి నుంచి ఆరంభం కానున్న మలేషియా ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌లో బరిలోకి దిగుతున్నారు. వరుస వైఫల్యాల నుంచి బయటపడేందుకు మలేషియా ఓపెన్‌లో సింధు, ప్రణయ్ పట్టుదలగా ఆడేందుకు ఎదురుచూస్తున్నారు. మహిళల సింగిల్స్‌లో పి.వి సింధుతో పాటు మాళవిక బాన్సోద్‌, ఆకర్షి కశ్యప్‌, ఉన్నతి హుడాలు అదృష్టం పరీక్షించుకోనున్నారు.
పురుషుల సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌ ప్రణయ్ తో పాటు సతీశ్‌ కరుణాకరన్‌, ఆయుష్‌ శెట్టి, ప్రియాన్షు రజావత్‌లు బరిలో నిలిచారు. ఇటీవల తైపీ ఓపెన్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకున్న ఆయుష్‌ శెట్టి మలేషియా ఓపెన్‌లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో వరల్డ్‌ నం.19 జోడీ ధ్రువ్‌ కపిల, తనీశ క్రాస్టోలు తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో పోటీపడనుండగా.. రోహన్‌ కపూర్‌, రుత్విక గద్దె ఆడనున్నారు. మహిళల డబుల్స్‌లో కవిప్రియ సెల్వం, సిమ్రన్‌ సింగ్వి.. వైష్ణవి, అలీశా ఖాన్‌ సహా ప్రేరణ, దేశ్‌పాండేలు ప్రధాన టోర్నీలో ఆడనున్నారు. నేడు జరిగే అర్హత పోటీల్లో మాజీ వరల్డ్‌ నం.1 కిదాంబి శ్రీకాంత్‌, శంకర్‌ ముతుస్వామి, తరుణ్‌ మానెపల్లి, అన్మోల్‌, తన్సీమ్‌ మిర్‌లు సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -