Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా 

గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా 

- Advertisement -

సర్పంచ్ పెద్ది నాగమణి మల్లేష్ 
నవతెలంగాణ – కట్టంగూర్
మల్లారం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ పెద్ది నాగమణి మల్లేష్ అన్నారు. సోమవారం గ్రామంలో నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక అధికారి గుడిపల్లి విజయరెడ్డి సర్పంచ్ నాగమణి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులచేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ అందరి సహకారంతో గ్రామ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చూస్తానని, సమస్యల పరిష్కారం కొరకు పాటుపడతానని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, జిపిఓ శోభ, ఉపసర్పంచ్ దండంపల్లి జగదీష్, వార్డు సభ్యులు పెద్ది శ్రీలత, గాధగోని సతీష్, దాసరి లింగయ్య, దాసరి కళమ్మ, దాసరి సంజయ్ కుమార్, పెద్ది మల్లేష్, పెద్ది మంజుల ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -