Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానని డొంకేశ్వర్ మండలంలోని తొండాకూర్ సర్పంచ్ అభ్యర్థి తాళ్ల ముత్యం మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నీ కలిసి ప్రధాన సమస్యలు తీర్చాలని వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. గ్రామంలోని డ్రైనేజీ, సిసి రోడ్లు, స్థానిక స్మశాన వాటిక కు ప్రహరీ గోడ, నీటి సౌకర్యం, మహిళా సంఘ భవనం, యూరియా కోసం గోదాం, స్ట్రీట్ లైట్లు ప్రధాన సమస్యలు ఉన్నాయని వివరించినట్టు తెలిపారు. నిజాయితీగా పనిచేస్తూ గ్రామ అభివృద్ధిలో నిర్విరామ కృషి చేస్తానని ,తనకు ఓటు వేసి గెలిపించాలని కోరినారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -