అంగన్వాడీ టీచర్ కుమ్మరికుంట్ల మాధవి
నవతెలంగాణ – నెల్లికుదురు
అంగన్వాడీ టీచర్ల సమస్యల కోసం మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తే పోలీసులచే అరెస్టు చేస్తారా అని అంగన్వాడీ టీచర్ కుమ్మరి కుంట్ల మాధవి, మయ్య పద్మ, కేక్కర్ల పద్మ,, తుమ్మెద పల్లి జ్యోతి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలపారు. చలో హైదరాబాద్ కార్యక్రమం వెళ్తారా అనే ఉద్దేశంతో సోమవారం ముందస్తు అరెస్టు చేసే కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు కొన్ని ఏళ్ల నుండి పరిష్కారం కాకుండా ఉండడంతో అంగన్వాడీ టీచర్లను చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు.
ఈ కార్యక్రమానికి వెళ్లకముందే ప్రభుత్వం పోలీసులు చే మమ్ములను ముందస్తుగా అరెస్టు చేయడం అన్యాయం అని అన్నారు. మా హక్కుల కోసం మేం పోరాటం చేస్తే ఎందుకు అరెస్టు చేస్తారని వారు ప్రశ్నించారు. ఈ దేశంలో సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ భావం కూడా లేకుండా పోయిందని వాపోయారు. అర్హులైన వారికి సూపర్వైజర్ పోస్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్ని ఏళ్ల నుండి అంగన్వాడి టీచర్ గా విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి రావాల్సినటువంటి డబ్బులను కూడా పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడం సరైనది కాదని అన్నారు. వీరికి వేతనం రూ.18 వేల ఇవ్వాలని మరియు హెల్త్ కార్డులు ఇచ్చి పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.



