Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంప్రశ్నలు అడిగితే ఎదురుదాడా?

ప్రశ్నలు అడిగితే ఎదురుదాడా?

- Advertisement -

సమాధానమివ్వకుండా
రాజకీయ పార్టీలకు ప్రశ్నలా?
బీజేపీ ప్రతినిధిగా సీఈసీ మాట్లాడుతున్నారు
జ్ఞానేష్‌ కుమార్‌ తన బాధ్యతల నుంచి పారిపోతున్నారు : ప్రతిపక్షాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

బీహార్‌ ఎస్‌ఐఆర్‌, ఓట్ల దొంగతనం, ప్రతిపక్షాలపై సీఈసీ వ్యాఖ్యలను నిరసిస్తూ పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. సోమవారం లోక్‌సభను స్పీకర్‌ ఓంబిర్లా ప్రారంభిస్తూ ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ఎస్‌ఐఆర్‌ను వెనక్కి తీసుకోవాలని, ఓటు చోరీ ఆపాలని పెద్దపెట్టున నినాదాల హౌరెత్తించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకురావడంపై లోక్‌సభ స్పీకర్‌ మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించకుండా ఉండాలని కోరారు. సభను ఉద్దేశించి బిర్లా మాట్లాడుతూ.. ‘మీరు నినాదాలు చేస్తున్న ఎనర్జీతో ప్రశ్నలు అడిగితే, అది దేశ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడానికి ప్రజలు మిమ్మల్ని ఇక్కడకు పంపలేదు.

ప్రభుత్వ ఆస్తులను నాశనం చేసే అధికారం ఏ సభ్యునికీ లేదని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. అదే సమయంలో హెచ్చరిస్తున్నా’ అని అన్నారు. ఎంపీల తీరు ఇలాగే కొనసాగితే, తాను ‘నిర్ణయాత్మక నిర్ణయం’ తీసుకోవలసి ఉంటుందని స్పీకర్‌ హెచ్చరించారు. వెంటనే సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్యే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఐఐఎం సవరణ బిల్లు, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి జన విశ్వాస్‌ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఇందులో జన విశ్వాస్‌ సవరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించారు. వెంటనే సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్యే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దేశ తొలి వ్యోమగామి శుభాన్షు శుక్లా- 2047 నాటికి విక్షిత్‌ భారత్‌ కోసం అంతరిక్ష కార్యక్రమం కీలక పాత్ర’ అనే అంశంపై చర్చను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ప్రారంభించారు. 2040 నాటికి భారత వ్యోమగామి చంద్రుడిపై కాలుమోపి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేవేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతరిక్ష యాత్ర ప్రణాళికలో భాగంగా తొలుత 2026లో మానవరహిత అంతరిక్ష యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. ‘వ్యోమ్మిత్ర’ అనే రోబోటిక్‌ మిషన్‌ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు.

ఇటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది. డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ్‌ సభ్యులు లేవనెత్తిన అంశాలను చర్చించాలని రూల్‌ 267 కింద ఇచ్చిన నోటీసులను తిరస్కరించారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. అనంతరం సభను నేటికి వాయిదా వేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad