Sunday, November 2, 2025
E-PAPER
Homeఆటలుసమం చేస్తారా?

సమం చేస్తారా?

- Advertisement -

భారత్‌, ఆసీస్‌ రెండో టీ20 నేడు
మ. 1.45 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

హౌబర్ట్‌ (ఆస్ట్రేలియా) : ఓ వైపు యాషెస్‌ సిరీస్‌ కోసం కంగారూలు కసరత్తు మొదలెట్టగా.. మరోవైపు 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సన్నాహాకంలో భాగంగా ప్రణాళికలను అమలు చేసేందుకు భారత్‌ బరిలోకి దిగుతోంది. యాషెస్‌ సవాల్‌ కోసం పేసర్‌ జోశ్‌ హాజిల్‌వుడ్‌ టీ20 జట్టును వీడగా.. విధ్వంసక ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ గాయం నుంచి కోలుకుని ఆసీస్‌ శిబిరంలో చేరాడు. మెల్‌బోర్న్‌లో అలవోక విజయం సాధించిన ఆసీస్‌ 1-0తో సిరీస్‌లో ముందంజలో కొనసాగుతుంది. ప్రథమ ప్రాధాన్య ఆటగాళ్లు లేకపోయినా.. ఆతిథ్య జట్టు మెరుగ్గానే కనిపిస్తోంది. సూర్యకుమార్‌ సేనకు నేడు హౌబర్ట్‌లో కఠిన సవాల్‌ ఎదురు కానుంది. ఈ మ్యాచ్లో నెగ్గి లెక్క సమం చేయాలని భారత్‌ భావిస్తోంది. భారత్‌, ఆస్ట్రేలియా మూడో టీ20 నేడు జరుగుతుంది.

సంజు శాంసన్‌కు సవాల్‌
సంజు శాంసన్‌ ఓపెనర్‌గా సత్తా చాటాడు. వరుస సెంచరీలతో తనేంటో నిరూపించుకున్నాడు. కొత్త బంతిని పవర్‌ప్లేలో బౌండరీ లైన్‌ దాటించటంలో నిలకడ చూపించాడు. కానీ శుభ్‌మన్‌ గిల్‌ రాకతో సంజు శాంసన్‌ ఓపెనర్‌ స్థానం కోల్పోయాడు. లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌లో నం.5, నం.6 పొజిషన్‌లో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. కానీ ఈ కొత్త పాత్రలో సంజు ఆశించిన మేరకు రాణించటం లేదు. మెల్‌బోర్న్‌లో సంజు శాంసన్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా ఆ ఇన్నింగ్స్‌ ఎంతోసేపు సాగలేదు. దీంతో సంజు శాంసన్‌ బ్యాటర్‌గా ఒత్తిడిలో కూరుకున్నాడు. పరుగుల వేటలో సంజు శాంసన్‌ మరోసారి తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం గత పది ఇన్నింగ్స్‌ల్లో పూర్తిగా తేలిపోయాడు. టాప్‌ ఆర్డర్‌లో సూర్యకుమార్‌ వైఫల్యం బ్యాటింగ్‌ లైనప్‌పై పడుతోంది. విలక్షణ షాట్లతో మెరిసే సూర్యకుమార్‌ యాదవ్‌ గతంలో మాదిరి బౌలర్లపై ఆధిపత్యం చూపించటం లేదు. అభిషేక్‌ శర్మ నిలకడగా రాణిస్తున్నా.. అతడికి సరైన సహకారం లభించటం లేదు. ఆల్‌రౌండర్లు అక్షర్‌ పటేల్‌, శివం దూబె తమ పాత్రకు న్యాయం చేయటం లేదు. కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తిలు తుది జట్టులో కొనసాగనుండగా.. జశ్‌ప్రీత్‌ బుమ్రా, హర్షిత్‌ రానాలు పేస్‌ బాధ్యతలు తీసుకోనున్నారు. అర్ష్‌దీప్‌ సింగ్‌ మరోసారి బెంచ్‌కు పరిమితం కానున్నాడు.

ఆధిక్యంపై గురి
ఆస్ట్రేలియా ఆధిక్యంపై కన్నేసింది. స్టార్‌ పేసర్‌ జోశ్‌ హాజిల్‌వుడ్‌ అందుబాటులో లేకపోయినా.. ఆ జట్టు పటిష్టంగానే కనిపిస్తోంది. కున్హేమాన్‌, నాథన్‌ ఎలిస్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌లు పదునైన పేస్‌తో భారత బ్యాటర్లను ఇరకాటంలో పెడుతున్నారు. హాజిల్‌వుడ్‌ దూరమైనా.. ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ రాకతో ఆసీస్‌ మరింత బలోపేతమైంది. మార్కస్‌ స్టోయినస్‌, మాక్స్‌వెల్‌తో ఆ జట్టు బ్యాటింగ్‌ లోతు మరింత పెరిగింది. కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌, ట్రావిశ్‌ హెడ్‌, జోశ్‌ ఇంగ్లిశ్‌, టిమ్‌ డెవిడ్‌లు ఆసీస్‌కు కీలకం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -