- Advertisement -
బెంగళూరు: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తన నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా అంతర్జాతీయ ఏవియేషన్ దిగ్గజం విలియం వాల్ష్‌ను నియమించుకున్నట్టు ప్రకటించిం ది. గతంలో బ్రిటిష్ ఎయిర్‌వేస్ సిఇఒగా పని చేసిన అనుభవం ఉన్న వాల్ష్ ప్రస్తుతం ఐఏటీఏ డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతున్నారు. ఆయన 2026 ఆగస్టు 3 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. అంతర్జా తీయ స్థాయిలో విమానయాన రంగాన్ని నడిపించిన అపార అనుభవం ఉన్న వాల్ష్ నాయకత్వంలో ఇండిగో మరిన్ని మైలురాళ్లను అధిగమిస్తుందని ఇండిగో చైర్మెన్ విక్రమ్ సింగ్ మెహతా పేర్కొన్నారు.
- Advertisement -



