Saturday, September 13, 2025
E-PAPER
Homeబీజినెస్హైదరాబాద్‌లో విన్‌ఫాస్ట్‌ ఇండియా..వీఎఫ్‌6, వీఎఫ్‌7 ప్రీమియమ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలు

హైదరాబాద్‌లో విన్‌ఫాస్ట్‌ ఇండియా..వీఎఫ్‌6, వీఎఫ్‌7 ప్రీమియమ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలు

- Advertisement -

హైదరాబాద్‌లో మొదటి ఎలక్ట్రిక్‌ షోరూమ్‌లు ప్రారంభం

నవతెలంగాణ-శేరిలింగంపల్లి
విన్‌ఫాస్ట్‌ ఇండియా మొదటి ఎలక్ట్రిక్‌ షోరూమ్‌లను నానేష్‌ ఆటోమోటివ్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ప్రారంభించారు. ప్రీమియమ్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలు వీఎఫ్‌6, వీఎఫ్‌7ను పరిచయం చేసింది. ఈ సందర్భంగా గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విన్‌ఫాస్ట్‌ ఇండియా డిప్యూటీ సీఈఓ అరుణోదరు దాస్‌ మాట్లాడారు. ప్రపంచ ప్రసిద్ధ డిజైన్‌ స్టూడియోలైన పినిన్‌ఫరినా, టొరినో డిజైన్‌ రూపొందించిన ప్రీమియమ్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలు వీఎఫ్‌6, వీఎఫ్‌7ను పరిచయం చేశామన్నారు. వీటిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 468 నుంచి 520 కిలోమీటర్ల డ్రైవింగ్‌ రేంజ్‌ వస్తాయన్నారు. పదేండ్ల బ్యాటరీ వారంటీ కలదన్నారు. పానోరమిక్‌ సన్‌రూఫ్‌, లెవల్‌-2 అడాస్‌, 360 కెమెరా, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ, లగ్జరీ ఇంటీరియర్లు వంటి ప్రీమియం ఫీచర్లు అసాధారణ డ్రైవింగ్‌ అనుభవాన్ని అందిస్తాయన్నారు. అదనంగా వీఎఫ్‌7 మోడల్‌ ఎఫ్‌డబ్ల్యూడీ, ఏడబ్ల్యూడీ వేరియంట్లలో లభిస్తున్నాయని తెలిపారు. అధిక సామర్థ్యం, శక్తివంతమైన పని తీరు కోసం ఎంచుకునే సౌలభ్యం ఉందన్నారు. వీఎఫ్‌6 ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.16.49 లక్షల నుంచి, వీఎఫ్‌7 ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.20.89లక్షల నుంచి ప్రారంభం అవుతున్నాయన్నారు. భారత మార్కెట్‌లో మరింతగా బలపడేందుకు దేశవ్యాప్తంగా ఛార్జింగ్‌, ఆఫ్టర్‌-సేల్స్‌ సేవల కోసం రోడ్‌గ్రిడ్‌, మైటీవీఎస్‌, గ్లోబల్‌ అష్యూర్‌ వంటి సంస్థలతో స్ట్రాటజిక్‌ భాగస్వామ్యాలను ఏర్పరచుకున్నామని తెలిపారు.

బ్యాటరీ రీసైక్లింగ్‌, సర్క్యులర్‌ వాల్యూ చైన్‌ అభివృద్ధి ద్వారా పర్యావరణ అనుకూల భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నట్టు బ్యాట్‌ఎక్స్‌ ఎనర్జీస్‌తో భాగస్వామ్యం చేసుకున్నామన్నారు. 2025 చివరి నాటికి 27 నగరాల్లో 35 డీలర్‌షిప్‌లు, 26 వర్క్‌షాప్‌లతో విస్తరించనున్నామని తెలిపారు. తద్వారా కస్టమర్లకు చాలా సులభంగా సేవలు అందించనున్నామని చెప్పారు. తమిళనాడులోని తూత్తుకుడిలో నిర్మాణానికి సిద్ధంగా ఉన్న కొత్త తయారీ కేంద్రం ప్రారంభంలో ఏటా 50,000 వాహనాల సామర్థ్యంతో భారత్‌లో ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలు, బ్యాటరీ ఉత్పత్తితో పాటు ఈవీ అభివృద్ధిలో తన దీర్ఘకాల పెట్టుబడిని ప్రతిబింబిస్తోందని తెలిపారు. భారత ఈవీ మార్కెట్‌ ఒక ఉత్తేజకరమైన మలుపులో ఉందన్నారు.
ఎక్కువ మోడల్స్‌ మార్కెట్‌లోకి వస్తున్నాయన్నారు. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నందున ప్రస్తుతం 2.5 నుంచి 4 శాతం మధ్య ఉన్న నాలుగు చక్రాల ఈవీల వినియోగం గణనీయంగా పెరుగుతుందన్నారు. పర్యావరణ అనుకూల పరిష్కారాలతో ఈ మార్పు ను ముందుకు నడిపేందుకు విన్‌ఫాస్ట్‌ కట్టుబడి ఉందన్నారు. సరికొత్త ఆవిష్కరణలు, పోటీ ధరలు, విజన్తో భారతదేశాన్ని చక్కటి ఆటోమోటివ్‌ భవిష్య త్తు వైపు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.



- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -