నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హసకొత్తుర్ లో గ్రామ పంచాయతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ చేతుల మీదుగా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాజ శ్రీనివాస మాట్లాడుతూ వేసవి ఎండలు ముదిరిన నేపథ్యంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు.
ప్రయాణికులు కూడా చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని దాహార్తిని తీర్చుకోవాలని కోరారు. గ్రామం గుండా రాకపోకలు సాగించే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఉపసర్పంచ్ ఏనుగు మనోహర్, పంచాయతీ కార్యదర్శి నవీన్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



