Saturday, April 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దుబ్బాకలో జీపీలో చలివేంద్రం ప్రారంభం

దుబ్బాకలో జీపీలో చలివేంద్రం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని దుబ్బాక, దమ్మన్నపేట, గ్రామాల్లో శనివారం అయ గ్రామాల పంచాయతీ కార్యాలయాల ఆధ్వర్యంలో సర్పంచులు, సరోజినీ దేవి, తలారి వసంతలు చలివెంద్రాన్ని ప్రారంభించారు. వేసవి దృష్టిలో ఉంచుకొని గ్రామస్థులకు మట్టి గుండాల్లో చల్లని నీటిని ప్రజలకు అందించాలని ఈ చలివెంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నీటిని ప్రతిరోజు శుద్ధిగా అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమములో ఎంపిఓ రాజేష్, ఆయా గ్రామాల గ్రామకార్యదర్శులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -