నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని వావిలాల గ్రామంలో గ్రామ ప్రజల దహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ గోగుల మమతా ప్రశాంత తెలిపారు. శనివారం గ్రామస్తులతో కలిసి చల్లటి నీరు అందించేందుకు ఆ గ్రామ బస్టాండ్ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో ఎండలు బాగా విపరీతంగా కొట్టడంతో ప్రజలు దాహం కోసం ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. గ్రామ ప్రజలు వివిధ రకాల పనుల నిమిత్తం బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి టైం పడుతుంది కనుక మార్గ మధ్యలో దాహం వేసి నోరు ఆరి దాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు గ్రామస్తులు దీని సద్విని చేసుకోవాలని తెలిపారు. దీనికోసం రోజు రోజు వాడిని శుభ్రపరచి స్వచ్ఛమైన నీరును అందిస్తామని తెలిపారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేష్ సురేష్ శాంతి కుమార్ శేఖర్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
వావిలాల గ్రామంలో చలివేంద్రం ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



