నవతెలంగాణ కమ్మర్ పల్లి
మండలంలోని నాగాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో ఏర్పాటుచేసిన ఈ చలివేంద్రాన్ని సర్పంచ్ కంపదండి అశోక్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. వేసవి ఎండలు ముదిరిన నేపథ్యంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షనీయమని ఈ సందర్భంగా ఎంపీడీవో పేర్కొన్నారు. ప్రయాణికులు కూడా చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని దాహార్తిని తీర్చుకోవాలని కోరారు.కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి సంధ్య, వార్డు సభ్యుడు సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలెపు రాజేశ్వర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
నాగాపూర్ లో చలివేంద్రం ఏర్పాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



