- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూర్
లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో మంగళవారం వాలుగొండ సత్తమ్మ జ్ఞాపకార్థం చలివేంద్రo ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని క్లబ్ కోఆర్డినేటర్ రెడ్డిపల్లి సాగర్ ప్రారంభించి మాట్లాడారు. చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, ట్రెజరర్ పోగుల రాములు, ఉపాధ్యక్షులు కల్లూరు వెంకటేశ్వర్లు సభ్యులు జెల్లా అశోక్, బొడ్డుపల్లి వెంకన్న ఆకుల సోమేశ్వర్, రాపో లు వెంకటేశ్వర్లు కడవేరు మల్లికార్జున్, చిట్టిప్రోలు మురళి, బొజ్జ శ్రీను, తదితరులు ఉన్నారు.
- Advertisement -



