Tuesday, February 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'వింటర్‌' షూటింగ్‌ షురూ..

‘వింటర్‌’ షూటింగ్‌ షురూ..

- Advertisement -

క్రిసెంట్‌ సినిమా, టీఎస్‌ఆర్‌ మేకర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వింటర్‌’. రామ్‌, ఆదిత్య సూరజ్‌ సింగ్‌, కుసుమ చందక, శశికళ, శ్రీజిత ఘోష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని రియాజ్‌ అహ్మద్‌, టి.శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ‘రాచరికం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సురేష్‌ లంకలపల్లి ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాతో రిజ్వాన్‌ అలీ విలన్‌గా తెరకు పరిచయం కానున్నారు. కాశ్మీర్‌లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాల్ని ఇటీవలే ఘనంగా నిర్వహించారు. చిత్ర ప్రారంభోత్సవంలో టీం అంతా పాల్గొంది. సినిమా అద్భుతంగా రావాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని కోరుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, ఇతర టెక్నికల్‌ టీమ్‌ వివరాల్ని ప్రకటించనున్నారు. రామ్‌, ఆదిత్య సూరజ్‌ సింగ్‌, కుసుమ చందక, శశికళ, శ్రీజిత గోష్‌, రిజ్వాన్‌ అలీ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి నిర్మాతలు: రియాజ్‌ అహ్మద్‌, టి.శ్రీనివాస్‌ రావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేష్‌ లంకలపల్లి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -