- Advertisement -
బెంగళూరు : ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు సంయుక్తంగా విష్ క్రెడిట్ కార్డును విడుదల చేసినట్టు సోమవారం వెల్లడించాయి. దీని కోసం ఫోన్‌పే యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపాయి. వినియోగదారులు కేవలం రూ.2000 నుండి డిపాజిట్ చేయడం ద్వారా విష్ క్రెడిట్ కార్డును పొందవచ్చని పేర్కొన్నాయి. జనాభాలోని అన్ని వర్గాలకు క్రెడిట్ కార్డులను చేరువ చేసే క్రమంలో కస్టమర్లకు మంచి క్రెడిట్ హిస్టరీని నిర్మించడంలో ఈ ప్రోడక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని ఫోన్‌పే హెడ్ ఆఫ్ పేమెంట్స్ దీప్ అగర్వాల్ పేర్కొన్నారు.
- Advertisement -