Tuesday, April 29, 2025
Homeసోపతికోర్కెల చిట్టా

కోర్కెల చిట్టా

నువ్వు కోర్కెల చిట్టాను పట్టుకుని
గుడిలో ఎదురు చూస్తున్నప్పుడు
ఆయనేమో స్మశానంలో రుద్రుడై
బూడిద రాసుకుంటున్నాడు
అర్ధం కాలేదా చివరికి మిగిలేదేమిటో…
చెప్పకనే చెప్పాడు…
జీవితం గుట్టు విప్పాడు…
దేహానికో మాయా మోహాన్ని కప్పాడు…
కష్టాల్ని దాచుకోమంటూ గరళాన్ని మింగాడు…
స్త్రీ పురుష శక్తులొక్కటేనని
అర్ధ నారీశ్వరుడై అర్ధాన్ని చాటాడు…
హదయంలోనే కాదు అవసరమైతే
నెత్తిన పెట్టుకోవాలంటూ గంగను శిరసుపైనుంచాడు…
ఇన్ని తత్వాల్ని తాండవిస్తుంటే
ఒంటిమీద బూడిద ఒక వైరాగ్య
సత్యాన్ని బోధించడం లేదా…
శ్మశానమొక పరమార్ధాన్ని ప్రబోధించడం లేదా…
ఆట గదరా ఇది…
పాడు దేహపు పాకులాట…
మాయామోహాల దోబూచులాట…
ఉత్త భ్రమల చిత్త భ్రమల వెతుకులాట…
ఇది సత్యానుసారం ప్రయాణించే జీవితమార్గం!
– ధాత్రి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img