Saturday, April 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎం రేవంత్‌రెడ్డితో

సీఎం రేవంత్‌రెడ్డితో

- Advertisement -

మీనేష్‌షా, జయతీర్థాచారి భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ (ఎన్‌డీడీబీ) చైర్మెన్‌ డాక్టర్‌ మీనేష్‌ షా, మదర్‌ డెయిరీ ఢిల్లీ చైర్మెన్‌ జయతీర్థాచారి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పాడి పారిశ్రామికాభివృద్ధిపైన వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ చైర్మెన్‌ గుత్తా అమిత్‌ రెడ్డి, ముఖ్యకార్యదర్శి ఇలంబర్తి, మదర్‌ డెయిరీ చైర్మెన్‌ మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -