- Advertisement -
గ్యాస్టవ్ మురికిపోయేలా.. వంటసోడాలో కొన్ని చుక్కల నీళ్లు పోసి మిశ్రమంలా తయారుచేయాలి. దీన్ని స్టవ్‌పై రాసి కొన్ని నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత స్క్రబ్‌తో రుద్దితే సరి. నీటితో శుభ్రం చేసి పొడి వస్త్రంతో తుడిస్తే మరకలు పోయి మిలమిలా మెరుస్తుంది.
దుర్వాసన రాకుండా…
కూరగాయలు, పండ్ల రసాలు, కెచప్‌లు.. ఇలా రకరకాల పదార్థాలు ఒలికిపోవడం వల్ల ఫ్రిజ్‌లో ఒకలాంటి వాసన వస్తుంది. అలాగే మరకలూ మొండిగా మారతాయి. ఇలాంటప్పుడు. సమాన పరిమాణాల్లో డిష్వాష్ సోప్, వంటసోడాలను కలిపి కొన్ని నీళ్లు పోసి మిశ్రమంలా తయారుచేయాలి. దీంతో మరకలున్న చోట రుద్దితే వాటితోపాటు వాసనా పోతుంది.
- Advertisement -