Tuesday, February 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఊహించలేనన్ని ట్విస్టులతో..

ఊహించలేనన్ని ట్విస్టులతో..

- Advertisement -

చంద్రహాస్‌ హీరోగా సంపత్‌ రుద్ర తెరకెక్కించిన చిత్రం ‘బరాబర్‌ ప్రేమిస్తా’. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్‌, ఎవిఆర్‌ మూవీ వండర్స్‌ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించారు. అర్జున్‌ మహీ (”ఇష్టంగా” ఫేమ్‌) ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ మూవీని ఈ నెల6న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకుడు జయంత్‌ సి పరాన్జీ, జేడీ చక్రవర్తి, ఆది సాయి కుమార్‌ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. హీరో చంద్రహాస్‌ మాట్లాడుతూ,’ధవన్‌ చాలా టాలెంటెడ్‌. ఈ చిత్రం కోసం అద్భుతమైన పాటల్ని అందించాడు. ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించిన చిన్ని, చందు, వెంకీకి, ఈ ప్రాజెక్ట్‌ నాకు రావడానికి కారణమైన కెమెరామెన్‌ శేఖర్‌కి థ్యాంక్స్‌. ఈ సినిమా ఒక్క సెకన్‌ కూడా బోర్‌ కొట్టకుండా ఉంటుంది. లెక్కపెట్టలేనన్ని, ఊహించలేనన్ని ట్విస్ట్‌లతో అద్భుతంగా ఉంటుంది. ప్రారంభం నుంచి చివరి వరకు అలా కూర్చుని చూస్తుండిపోతారు.

సంపత్‌ ఈ మూవీని గొప్పగా తీశారు. నన్ను బాగా చూపించారు’ అని అన్నారు. ‘ఈ సినిమాతో చంద్రహాస్‌కు మంచి బ్రేక్‌ రావాలని కోరుకుంటున్నాను. ఈ మూవీని చూసి సపోర్ట్‌ చేస్తారని ఆశిస్తున్నాను’ అని ఆది సాయి కుమార్‌ అన్నారు. జయంత్‌ సి పరాన్జీ మాట్లాడుతూ,’ఈ టైటిల్‌లోనే యాటిట్యూడ్‌, కాన్ఫిడెన్స్‌, పొగరు ఉంది. ఈ చిత్రం పెద్ద హిట్‌ అవుతుందనే నమ్మకం నాకుంది’ అని చెప్పారు. సంపత్‌ రుద్ర మాట్లాడుతూ, ‘నిర్మాత వెంకీ నా క్లాస్‌ మేట్‌. అతను లేకపోతే ఈ చిత్రం లేదు. చందు, చిన్ని తరువాత ఈ ప్రాజెక్టులోకి వచ్చారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటి వరకు ఇలాంటి ఓ కమర్షియల్‌ చిత్రం రాలేదు. క్లైమాక్స్‌ చూసి అందరూ షాక్‌ అవుతారు. ఆ షాక్‌ నుంచే థియేటర్‌ నుంచి బయటకు వస్తారు’ అని తెలిపారు. ‘నాకు బుజ్జి లాంటి మంచి పాత్రను ఇచ్చిన సంపత్‌కి థ్యాంక్స్‌. చంద్రహాస్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. ధవన్‌ మ్యూజిక్‌ అద్భుతంగా ఉంటుంది’ అని మేఘన ముఖర్జీ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -