Wednesday, July 16, 2025
E-PAPER
Homeసినిమామనిషిలోని భిన్న కోణాలతో ..

మనిషిలోని భిన్న కోణాలతో ..

- Advertisement -

దర్శకుడు నరసింహ నంది తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. ఎస్విఎస్‌ ప్రొడక్షన్స్‌ , శ్రీనిధి సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ విడుదల కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. షేక్‌స్పియర్‌ కథలోని పాత్రలను ఆధారంగా తీసుకొని తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో జరిగే పొలిటికల్‌, ఫ్యామిలీ ఇతివత్తంగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ,’మనిషిలోని భిన్న కోణాలతో ఈ కథని తయారు చేశాను. నిర్మాతలు నరేష్‌ గౌడ, పరిగి మల్లిక్‌ ఈ సినిమాను చాలా ప్యాషన్‌తో చేశారు. కమర్సియల్‌ అంశాలతో ఉన్న కథ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ కథకు కనెక్ట్‌ అవుతారు’ అని అన్నారు. ‘నరసింహ నంది సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అందర్నీ అలరించే సినిమా ఇది’ అని నిర్మాతలు నరేష్‌ గౌడ, పరిగి మల్లిక్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -