Wednesday, November 5, 2025
E-PAPER
Homeమానవిమెంతి ఆకులతో…

మెంతి ఆకులతో…

- Advertisement -

సాధారణంగా ఆకుకూరలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఒక్కో ఆకు కూరతో శరీరానికి అనేక లాభాలున్నాయి. ఇందులో ముఖ్యంగా మెంతికూర. ఇది కూర రుచిని పెంచడమే కాకుండా అనారోగ్య సమస్యలను తగ్గిస్తుండంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మెంతి గింజలు అనేక ప్రయోజనాలు అందిస్తాయని అందరికి తెలిసిన విషయమే. వీటితోపాటు.. మెంతి ఆకులు మధుమేహం, గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహయపడతాయి. ఇందులో ఐరన్‌, సెలీనియం, కాల్షియం, మాంగనీస్‌, మినరల్స్‌, జింక్‌ వంటి పోషకాలున్నాయి. ఇవి అనారోగ్య సమస్యలను తగ్గించడంలోఎక్కువగా సహాయపడతాయి.
పచ్చి మెంతి ఆకులు టైప్‌ 1, టైప్‌ 2 డయాబెటిస్‌ సమస్యలో చక్కర స్తాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. దీంతో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా.. ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గిస్తుంది. దీంతో గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది. మెంతి ఆకులలో పీచు జీర్ణక్రియ ప్రక్రియను సరిగ్గా ఉంచుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.
అధిక రక్తపోటులో మెంతి ఆకులు కూడా మేలు చేస్తాయి. గెలాక్టోమన్నన్‌, పొటాషియం ఉండడం వలన రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. మెంతి ఆకులు బరువు తగ్గిస్తాయి. అలాగే కడుపులో అల్సర్‌, పేగు మంట సమస్యను తగ్గిస్తాయి.
మెంతి ఆకులను తీసుకోవడం వలన దగ్గు, బ్రోన్కైటిస్‌ ఎగ్జిమా వంటి వ్యాధులతో పోరాడడంలో ఇది సహాయపడుతుంది. పురుషుల్లో టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. మెంతి ఆకులను తినడం వలన తల్లిపాలు ఉత్పత్తి అవుతాయి. రోజూ ఒక స్పూన్‌ మెంతి ఆకుల రసాన్ని తీసుకుంటే కడుపులో నులిపురుగులు తగ్గుతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -