- Advertisement -
మానవప్రపంచం
దయలేని జంతుప్రదర్శనశాలగా
మారిపోయింది
ఇళ్ళన్నీ సమస్త వస్తుప్రదర్శన శాలలయ్యాయి
మనుషులందరూ
లింగవివక్ష లేకుండా
విచిత్ర వేషధారణ
పాత్ర గొప్పగా అభినయిస్తున్నారు
సెల్లు చేతికొచ్చాక
అంతా ఏకపాత్రాభినయమే చేస్తున్నారు
ముందున్న ముఖం కన్నా
తర్వాత కప్పుకున్న ముసుగు ప్రధానమైపోయింది
శభాష్!
బతుకు గోడకున్న అబద్ధాల పగుళ్ళకు
ఎంత చక్కని అందమైన పెయింటో!!
- నలిమెల భాస్కర్
- Advertisement -



