Tuesday, February 24, 2026
E-PAPER
Homeసినిమావాస్తవ ఘటనలతో..

వాస్తవ ఘటనలతో..

- Advertisement -

డైరెక్టర్‌ పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి రూపొందిస్తున్న తాజా చిత్రం ‘కాక్రోచ్‌’. అభిలాష్‌ సుంకర, ప్రేమసన్‌, నవీన్‌, తీర్థ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మి పిక్చర్స్‌ బ్యానర్‌ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 6న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత బి.బాపి రాజు మాట్లాడుతూ, ‘సమాజంలో జరుగుతున్న ఘటనలకు వాస్తవిక రూపంగా ఈ సినిమాను నిర్మించాం. ఈ చిత్ర నిర్మాణ సమయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నాం. సహజమైన లొకేషన్స్‌ లో చిత్రీకరణ రిస్కీ కానీ చేశాము. రొటీన్‌ సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు మా మూవీ కొత్తదనం ఇస్తుంది. ఇదొక మంచి సినిమా అని గర్వంగా చెప్పగలను’ అని అన్నారు. ‘నేను జర్నలిస్ట్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేశాను. పాత్రికేయుడిగా నేను సమాజంలో చూసిన వాటిని ప్రేక్షకులకు కూడా తెలియజేయాలి అనే ఉద్దేశంతో దర్శకుడిగా మారాను.

ఆ క్రమంలోనే ఈ చిత్రాన్ని కూడా రూపొందించాను. విశాఖ, గాజువాక ప్రాంతంలో ఉండే కొందరు నేరస్తుల నిజ జీవిత ఘటనల ఆధారంగా ఒక వయలెంట్‌ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. వేల కోట్ల రూపాయల మోసాలు చేసేవారిని వదిలేసే ఈ వ్యవస్థ, చిన్న చిన్న దొంగతనాలు చేసేవారి మీద ప్రతాపం చూపిస్తుంటుంది. మురికి కూపాలలో ఉన్న నేరస్థుల జీవితాల్లోని అనుభవాలు, ప్రేమలు నాకు చాలా విచిత్రంగా అనిపించాయి. అడ్డు రోడ్డు మీద ఉండే వేశ్యకు, ఒక క్రిమినల్‌కు మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించాను. డార్క్‌ బ్యాక్‌డ్రాప్‌లో భిన్నంగా ఉంటుంది. రెగ్యులర్‌ సినిమా అని వస్తే నిరుత్సాహపడొచ్చు. కానీ ఇది చాలా భిన్నమైన సినిమా. చిన్న పిల్లలు, సున్నిత మనస్కులు ఈ చిత్రానికి దూరంగా ఉండమని మనవి చేస్తున్నాను’ అని డైరెక్టర్‌ పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -