No menu items!
Monday, September 1, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeమానవిరైస్‌ వాటర్‌తో...

రైస్‌ వాటర్‌తో…

- Advertisement -

జుట్టు మృదువుగా ఉండడం కోసం హెయిర్‌ కండీషనర్‌ ఉపయోగిస్తాం. అయితే ఎక్కువ కెమికల్స్‌ ఉన్న హెయిర్‌ కండిషనర్‌ ఉపయోగించడం వల్ల క్రమంగా జుట్టు డ్రై గా మారిపోతుంది. సహజంగా ఇంటి వద్దనే జుట్టును ఎంతో మృదువుగా ఉంచుకోవడం కోసం రైస్‌ వాటర్‌ని ఉపయోగించవచ్చు. రైస్‌ వాటర్‌ని తలకు బాగా మసాజ్‌ చేసి ఒక అరగంట ఉంచిన తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు మూడుసార్లు చేస్తూ ఉంటే క్రమంగా మీ జుట్టు మృదువుగా మారుతుంది.

చర్మ సంరక్షణ
రైస్‌ వాటర్‌ ని మన ఫేస్‌ పై బాగా మసాజ్‌ చేసుకొని.. ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల ముఖం మీద మచ్చలు, మొటిమలు క్రమంగా తగ్గడంతో పాటు మీ మేని ఛాయ కూడా మెరుగు పడుతుంది. ఇందులో ఉన్న ఆంటీ ఆక్సిడెంట్‌ తత్వాలు చర్మం మీద పలు రకాల ఇన్ఫెక్షన్స్‌తో పోరాడుతాయి. రైస్‌ వాటర్‌ చర్మం పై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తుంది. చర్మాన్ని డీప్‌ గా మాయిశ్చరైజ్‌ చేసి చాలా రిఫ్రిషింగ్‌ లుక్‌ ఇస్తుంది.

రైస్‌ వాటర్‌ తయారీ
బియ్యం ఒకసారి కడిగిన తర్వాత మళ్లీ కొంచెం నీళ్లు పోసి అరగంట పాటు నానపెట్టాలి. ఇప్పుడు ఇలా నానబెట్టిన నీటిని జాగ్రత్తగా వడకట్టుకొని ఒక బాటిల్‌ లో స్టోర్‌ చేసుకోవాలి. ఈ వాటర్‌ ను ప్రతిరోజు ఫ్రెష్‌ గా చేసుకోవచ్చు లేక ఫ్రిజ్లో ఒక రెండు మూడు రోజులు నిలువ పెట్టుకోవచ్చు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad