మహమ్మద్ నజీర్, రిఫత్ రజూర్ జంటగా నటించిన మెలోడియస్ మ్యూజిక్ వీడియో ‘అప్నీ హద్ సే’. ప్రసాద్ ల్యాబ్స్‌లో సినీ ప్రముఖుల మధ్య ఈ మ్యూజిక్ వీడియో ఘనంగా విడుదలైంది.
ఈ వేడుకకు జుబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై, సాంగ్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘యువ ప్రతిభను ప్రోత్సహించడం సంతోషంగా ఉంది. సౌత్‌లో హిందీ సినిమా చేయటం చాలా మంచి పరిణామం. ఈ సినిమా, వీడియో సాంగ్ మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
ఈ మ్యూజిక్ వీడియోలో మహమ్మద్ నజీర్ హీరోగా నటించగా, రిఫత్ రజూర్ హీరోయిన్‌గా మెరిశారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘ప్రియతమా’ (మజిలీ) వంటి సూపర్ హిట్ సాంగ్స్ పాడిన అభయ్ జోధ్‌పుర్కర్ తన గాత్రంతో ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. అత్యున్నత నిర్మాణ విలువలతో, రిచ్‌గా అనిపించే విజువల్స్‌తో ఈ వీడియో సాంగ్‌ను రూపొందించారు. హీరో మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ,’అభరు జోధ్‌పుర్కర్ వంటి గొప్ప సింగర్ మా పాట పాడటం మాకు గర్వకారణం. ప్రేక్షకులకు ఈ పాట కచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నాను’ అని చెప్పారు.
అద్భుతమైన విజువల్స్‌తో..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



