అచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన సిరీస్ ‘మోతెవరి లవ్ స్టోరీ’. ప్రేమ, హాస్యం వంటి ప్రధాన అంశాలతో అత్యంత సహజంగా రూపొందించిన ఈ సిరీస్‌లో అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించారు. శివ కష్ణ బుర్రా దర్శకుడు.
బుధవారం ఈ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. నటుడు ఆనంద్ దేవరకొండ ఈ కార్యక్రమానికి హాజరై పోస్టర్, టైటిల్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.
ఏడు ఎపిసోడ్స్‌గా రాబోతోన్న ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ ఒక పెళ్లి చుట్టూ జరిగే డ్రామా నేపథ్యంలో ఉంటుంది.
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, ‘టైటిల్, పోస్టర్ చాలా కొత్తగా ఉంది. నా జర్నీలో మై విలేజ్ షో టీం పాత్ర చాలా ఉంది. ఈ సిరీస్‌కి పెద్ద సక్సెస్ రావాలి’ అని అన్నారు. ‘నాకు జీ5 సంస్థతోపాటు మధుర శ్రీధర్ ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. మేం ప్రొడక్షన్ సైడ్ రావడం ఇదే మొదటి సారి. మై విలేజ్ షో ఫౌండర్ శ్రీరామ్ శ్రీకాంత్‌కి థ్యాంక్స్. చరణ్ తన సంగీతంతో ప్రాణం పోశారు. గంగన్న లిరిక్స్ బాగున్నాయి. సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని దర్శకుడు శివ కష్ణ అన్నారు. నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ,’జీ5తో కలిసి ఈ సిరీస్‌ను చేయడం ఆనందంగా ఉంది. తెలంగాణ మూలాల్లోంచి తీసిన మొదటి సిరీస్ ఇదే’ అని తెలిపారు.
తెలంగాణ మూలాలతో.. ‘మోతెవరి లవ్ స్టోరీ’
- Advertisement -
- Advertisement -