ప్రభుత్వ పాఠశాలలో టీచర్ విగ్రహం ఏర్పాటు
నవతెలంగాణ – నసురుల్లాబాద్
ఉపాధ్యాయుడు విద్యార్థుల జ్ఞానం, నైపుణ్యాలు లేదా విలువలను సంపాదించడానికి సహాయపడే వ్యక్తిగా కాకుండా తన హయంలో కనీసం 200 మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగులు రావాలని ఆశయంతో కృషి చేశారు. ఫలితంగా గ్రామంలో సుమారు 100 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో కృషి చేసిన టీచర్ విగ్రహన్ని కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం అంకోల్ తండాకు చెందిన దివంగత టీచర్ సురేందర్ నాయక్ గ్రామాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన టీచర్ జ్ఞాపకార్థం విగ్రహాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రతిష్ఠించారు.
ఆయన కృషితోనే తండాలో విద్యలో ఒక విప్లవాన్ని సాధించిందని. సురేందర్ నాయక్ కృషి ఫలితంగా ప్రస్తుతం గ్రామంలో సుమారు 100 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని గ్రామస్తులు తెలిపారు. ఏటా ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఆయన విగ్రహానికి వారందరూ పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారని , అలాగే ఉపాధ్యాయులందరికీ సన్మానం చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల ప్రేమ ఆప్యాయత చూపాలని గ్రామస్తులు కోరారు.
టీచర్ ఆశయంతో.. 100 మందికి ఉద్యోగాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES