అధికార పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధికి అడుగులు పడతాయి
కొండాపురం కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి గిరి కరుణాకర్ గౌడ్
నవతెలంగాణ – చండూరు
కొండాపురం గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఆశీర్వదిస్తే నాయకుడిగా కాదు ప్రజల సేవకుడిగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కొండాపురం కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి గిరి కరుణాకర్ గౌడ్ అన్నారు. మంగళవారం గ్రామంలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తే గ్రామ అభివృద్ధికి అడుగులు పడ్డాయన్నారు. గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే గొప్ప లక్ష్యంతో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి అధిక నిధులు తీసుకువచ్చి మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. గ్రామ అభివృద్ధి తమ లక్ష్యంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు గ్రామంలోని ప్రజలు కత్తెర గుర్తుపై ఓటు వేసి తమను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చేపూరి యాదయ్య, బైరుకొండ సైదులు, నరసింహ, శ్రీశైలం, కొమరయ్య,సంజీవ బరిగల వెంకటేశం, బోయపల్లి అంజయ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సహకారంతో ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



