Saturday, September 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవర్షంతో.. పునాది కొట్టుకుపోవడంతో

వర్షంతో.. పునాది కొట్టుకుపోవడంతో

- Advertisement -

హయత్‌నగర్‌లో ఒరిగిన భవనం

నవతెలంగాణ-హయత్‌నగర్‌
హైదరాబాద్‌లో గురువారం కురిసిన భారీ వర్షం కారణంగా పలు కాలనీలు జలమయమయ్యాయి. హయత్‌నగర్‌ పద్మ కాలనీలోని ఓ ఇంటి పునాది కొట్టుకుపోవడంతో భవనం పక్కకు ఒరిగి ప్రమాదకర స్థితిలోకి చేరింది. వర్షం కారణంగా ఆ ఇంటి పునాది బలహీనపడటంతో భవనం మెల్లగా పక్కకు ఒరగడం ప్రారంభించింది. ఏ క్షణాన కూలిపోతుందోనన్న భయంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఒరిగిన భవనానికి ఆనుకొని 11 కేవీ హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు ఉండటంతో ప్రమాదం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -