ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం
మెట్రో రైల్‌పై తప్పు దారిలో వెళ్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
కిషన్‌రెడ్డి, బండి సంజరుతో తెలంగాణకు ఉపయోగం లేదు
బీఆర్‌ఎస్ విప్ కెపి వివేకానంద
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణలో దోచుకున్న సొమ్ముతో కాంగ్రెస్ నాయకులు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్ విప్ కెపి వివేకానంద ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రో రైలు విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి మొదటి నుంచి తప్పు దారిలో వెళ్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఆయన అనుభవ రాహిత్యం కారణంగానే ఇదంత జరుగుతున్నదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ రంగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. మూసీ సుందరీకరణ పేరుతో మూడు వేల ఎకరాలు, హెచ్‌సీయూ భూములు, హిల్ట్ పాలసీ, టీడీఆర్ భూములను కొల్లగొట్టాలని చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను తన అనుచరులకు కట్టబెడుతు ఆస్తులను పెంచుకున్నారని ఆరోపించారు. ఎల్ అండ్ టీని బ్లాక్‌మెయిల్ చేసి జైల్లో వేస్తామని చెప్పి మెట్రోకి చెందిన 250 ఎకరాలను కాజేయాలని చూస్తున్నారని విమర్శించారు. 70 సార్లు ఢిల్లీ పోయిన రేవంత్‌రెడ్డి మెట్రో విషయంలో ఏనాడు కేంద్ర మంత్రితో మాట్లాడలేదని చెప్పారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజరుతో తెలంగాణకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. వారు అలంకారంగా మాత్రమే కేంద్ర మంత్రులుగా ఉన్నారని అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేయడంలో కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి ఒక్కటేనని విమర్శించారు. తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై సీపీఎం, సీపీఐ నాయకులను అడిగితే తెలుస్తుందన్నారు. రేవంత్‌రెడ్డి ఇంగ్లీష్‌తో కేరళం ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, కె కిశోర్‌గౌడ్, తుంగబాలు, వెంకటేశ్‌గౌడ్, కీర్తిలతగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దోచుకున్న సొమ్ముతో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



