Wednesday, February 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుతో ఆలేరు పట్టణ అభివృద్ధికి బాటలు  

బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుతో ఆలేరు పట్టణ అభివృద్ధికి బాటలు  

- Advertisement -

 నవతెలంగాణ – ఆలేరు టౌను
 ఆలేరు మున్సిపల్ ఎన్నికలలో, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుతో, పట్టణ అభివృద్ధికి బాటలు వేయాలని, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి  అన్నారు. ఆలేరు పట్టణంలో బుధవారం  రెండో వార్డ్, మూడవ వార్డులలో ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత, 420 హామీలను అమలు చేయక ప్రజలను మోసగించారని అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో ఓటు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలకి సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థులు మోతే కనకమ్మ వెంకటేష్ , యాట శివ,పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్,  మాజీ ఎంపీపీ క్యాశగల్ల అనసూయ, జిల్లా నాయకులు కొలుపుల హరినాథ్, మాజీ కౌన్సిలర్ బేతి రాములు, మాజీ సర్పంచ్ లు రామ్ గోపాల్ రెడ్డి, గిరిరాజు వెంకటయ్య, సిరిగిరి విద్యాసాగర్,  యాట విజయలక్ష్మి, భవాని, బండ్రు ఆంజనేయులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -