Sunday, August 3, 2025
E-PAPER
Homeసినిమాఈ గౌరవంతో మరింత బాధ్యతగా మంచి సినిమాలు చేస్తాం

ఈ గౌరవంతో మరింత బాధ్యతగా మంచి సినిమాలు చేస్తాం

- Advertisement -

71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘బేబి’ సినిమాకి సంబంధించి ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌గా సాయి రాజేశ్‌, ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌గా పీవీఎన్‌ ఎస్‌ రోహిత్‌ (ప్రేమిస్తున్నా పాటకు) అవార్డులు గెల్చుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈ చిత్ర బృందం నిర్వహించిన మీడియా సమావేశంలో సింగర్‌ పీవీఎన్‌ ఎస్‌ రోహిత్‌ మాట్లా డుతూ, ‘ఈ సినిమాకు ముందు నేను ఆశించినట్లుగా కెరీర్‌ ఉండేది కాదు. నా పాటలు వేరే సింగర్స్‌తో రీప్లేస్‌ అయ్యేవి. ఈ సినిమాలో ‘ప్రేమిస్తున్నా..’ పాట పాడే అవకాశం నాకు వచ్చినప్పుడు ఇది డూ ఆర్‌ డై అనేలా తీసుకున్నా. ఈ రోజు బెస్ట్‌ సింగర్‌గా నేషనల్‌ అవార్డ్‌ పొందడం చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపారు.
‘ఇది తెలుగు సినిమా గర్వించాల్సిన సందర్భం. జాతీయ స్థాయిలో మన తెలుగు సినిమా మరోసారి విజయకేతనం ఎగురవేసింది. ‘బేబి’ సినిమా మాకు డబ్బుతో పాటు ఫిలింఫేర్‌, సైమా, గామా వంటి ఎన్నో పురస్కారాలు తీసుకొచ్చింది. ఇప్పుడు నేషనల్‌ అవార్డ్స్‌ దక్కడం మరింత హ్యాపీగా ఉంది. ఈ అవార్డులు ఇచ్చిన గౌరవం మాపై మరిన్ని మంచి చిత్రాలు చేయాలనే బాధ్యత పెంచింది’ అని దర్శక, నిర్మాతలు సాయి రాజేష్‌, ఎస్‌కేఎన్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -