నువ్వుల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అంటూ వేర్వేరుగా ఉన్నా రెండింటిలో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. ఇందులోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, జింక్, కాల్షియం, థయామిన్, ఇతర మినరల్స్ ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే నువ్వులు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, అందానికి కూడా ఉపయోగపడతాయి. అదెలాగో తెలుసుకుందాం..
నువ్వులను ఆహారంలో భాగం చేసుకుంటే చర్మంపై ఉండే ముడతలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ ఇ, బి6, మెగ్నీషియం వంటి పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అంతేకాకుండా నువ్వుల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ముఖంపై ఏర్పడే వాపులను తగ్గిస్తాయి. మొటిమలు, తామర వంటి సమస్యలను దరిచేరకుండా చేస్తాయి.
నువ్వుల నూనె మంచి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో ఉపయోగపడుతుంది. చర్మాన్ని మదువుగా, కాంతివంతంగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. ప్రతిరోజూ పడుకునే ముందు నువ్వుల నూనెను ముఖంపై సున్నితంగా మసాజ్ చేస్తే, కొద్ది రోజుల్లోనే దాని ప్రభావం కనిపిస్తుంది.
నువ్వులతో ఫేస్‌కి స్క్రబ్ కూడా చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు, ఒక చెంచా పెరుగు, ఒక చెంచా తేనె కలిపి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి అయిదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.
నువ్వుల పొడి కూడా సహజ క్లెన్సర్‌గా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పొడిని ఒక టీస్పూన్ శెనగపిండి, కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లో తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 10 నిమిషాలు ఉంచి, తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.
నువ్వులతో..
- Advertisement -
- Advertisement -